Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేడు హైదరాబాద్‌లో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర

హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈరోజు నగరంలో జన ఆశీర్వాద యాత్ర చేయనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొననున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం అనంతరం  యాత్ర ప్రారంభంకానుంది. భువనగిరిలో కేంద్రం ఇస్తోన్న ఉచిత రేషన్ బియ్యం పంపిణీ కేంద్రాన్ని కేంద్రమంత్రి సందర్శించనున్నారు. ఘట్కేసర్ వద్ద కేంద్రమంత్రికి  మేడ్చల్ జిల్లా బీజేపీ నేతలు ఘనస్వాగతం పలకనున్నారు. మధ్యహాన్నం ఒంటి గంటకు ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద కిషన్ రెడ్డికి హైదరాబాద్ బీజేపీ ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించనుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50 కిలోమీటర్ల మేర జన ఆశీర్వాద యాత్ర చేయనున్నారు. సాయంత్రం 7గంటలకు బీజేపీ కార్యాలయం వద్ద జరిగే బహిరంగ సభలో కిషన్ రెడ్డికి సన్మాన కార్యక్రమం జరుగనుంది. 

Advertisement
Advertisement