దివ్యాంగులకు కేంద్రప్రభుత్వం అన్నివిధాల అండ: కిషన్ రెడ్డి

ABN , First Publish Date - 2021-12-19T22:12:24+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల కేంద్రం ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం,వయో వృద్ధుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుననట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

దివ్యాంగులకు కేంద్రప్రభుత్వం అన్నివిధాల అండ: కిషన్ రెడ్డి

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల కేంద్రం ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం,వయో వృద్ధుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుననట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారికత మంత్రిత్వ శాఖ ద్వారా దివ్యాంగులకు, వయో వృద్ధులకు అవసరమైన ఉపకరణాలు, సహాయ పరికరాలను ఉచితంగాఅందించే కార్యక్రమంలో భాగంగా  సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లోని అర్హులైన లబ్దిదారులను గుర్తించేందుకు గుడిమల్కాపుర్ లోని  ఎస్ బి ఐ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు .


ఈ సందర్బంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం  దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. నూతన  చట్టం ద్వారా వికలాంగులు అనే పదాన్ని దివ్యాంగులుగా మార్చి సకలాంగులతో సకల హంగులతో వారికి సమానంగా గౌరవాన్ని అందించారని ఆయన అన్నారు.అదేవిధంగా దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ ని ‘3’ నుంచి ‘4’ శాతానికి కూడా పెంచడం జరిగిందని, అంతే కాకుండా వివిధ ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యత కల్పించడం, ప్రయాణాల రాయితీ ఇవ్వటం, స్కాలర్ షిప్ లు ఇవ్వడం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది  ఆయన తెలిపారు .


దివ్యాంగులకు వివిధ రంగాల్లో ఉన్న ప్రతిభావంతులకు, వయోవృద్ధులకు ఎవరికి ఏ పరికరము అవసరమో గుర్తించి ఎంపిక చేసే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈసదుపాయాన్నిసద్వినియోగం చేసుకోవాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.ఈ శిబిరంలో సుమారు 250 దివ్యాంగులు తమ పేర్లను  నమోదు చేసుకోగా, వీరందరికీ త్వరలోనే వారికి అవసరమయ్యేవివిధ పరికరాలు అందజేస్తామని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-12-19T22:12:24+05:30 IST