Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీని కేంద్రం ఆదుకుంది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

విజయవాడ: రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఏపీని కేంద్రం ఆదుకుందని కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. నగరంలో జరిగిన జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడారు. కొంతమంది కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. అనేక అంశాలలో ఏపీకి ప్రాధాన్యతనిచ్చి నిధులు ఇచ్చామన్నారు. వ్యక్తులు, కుటుంబాల ఆధారంగా నడిచే పార్టీలను నమ్మొద్దని ఆయన పిలుపునిచ్చారు. కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చాయన్నారు. రెండు రాష్ట్రాలూ నష్టపోకుండా కేంద్రం బాధ్యత తీసుకుందని కిషన్‌రెడ్డి  పేర్కొన్నారు. 

Advertisement
Advertisement