Advertisement
Advertisement
Abn logo
Advertisement

HYD : అంబేడ్కర్‌ విగ్రహం కోసం CM KCR కు లేఖ రాస్తా : కేంద్ర మంత్రి

హైదరాబాద్ సిటీ/రాంనగర్‌ : పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటు కోసం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. అంబర్‌పేటలో ఛేనెంబర్‌ చౌరస్తాలో నిలిచిన జ్యోతిరావుఫూలే స్మారక కేంద్రం ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఆదివారం బాగ్‌అంబర్‌పేటలోని వీహెచ్‌ ఇంటికి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వచ్చి భేటీ అయ్యారు. వీహెచ్‌ మాట్లాడుతూ అంబేడ్కర్‌ విగ్రహాన్ని పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోకుండా దళితులను అవమానపరుస్తుందన్నారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని మూడేళ్లుగా పోలీ‌స్‌ స్టేషన్‌లో ఉంచినా, పట్టించుకోవడం లేదన్నారు. 


ఎంపీ నిధులు కేటాయిస్తా: కిషన్‌రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అంబర్‌పేట ఛే నెంబర్‌లో జ్యోతిరావుపూలే స్మారక కేంద్రం విషయంలో సీఎం కేసీఆర్‌తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. జ్యోతిరావుపూలే స్మారక కేంద్రం కట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే తన ఎంపీ నిధులను కేటాయిస్తానన్నారు. పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహాం ఏర్పాటుచేయాలని, అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటు  కోసం సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానన్నారు.

Advertisement
Advertisement