Advertisement
Advertisement
Abn logo
Advertisement

భువనగిరిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర

యాదాద్రి: భువనగిరిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నామని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. దేశంలో పర్యాటక రంగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు .బతుకమ్మ, గిరిజన పండగలు, సమ్మక్క-సారక్క జాతరలను వచ్చే రెండేళ్లలో టూరిజం స్పాట్‌లుగా చేయనున్నట్లు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి భువనగిరి కోటను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న ఆయన హుజురాబాద్ లాంటి ఎన్నికలు గతంలో ఎక్కడా చూడలేదన్నారు. కుటుంబ రాజకీయాలు చేసేవారిని ప్రజలు తిప్పికొడుతారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

Advertisement
Advertisement