సోనియా గాంధీని తూర్పూరా బట్టిన కేంద్ర మంత్రులు

ABN , First Publish Date - 2021-06-20T02:56:28+05:30 IST

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై కేంద్రమంత్రులు విరుచుకుపడ్డారు. కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రి

సోనియా గాంధీని తూర్పూరా బట్టిన కేంద్ర మంత్రులు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై కేంద్రమంత్రులు విరుచుకుపడ్డారు. కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రి అనురాగ్ ఠాగూర్ స్పందిస్తూ... ‘‘సోనియా గాంధీ గారూ... మీరు రాయబరేలీ ప్రజల్ని తమ కుటుంబ సభ్యులుగా భావించడం లేదా? ఎందుకు రహస్యంగా టీకా వేసుకున్నారు?రాయబరేలీని ఎందుకు విస్మరించారు?’’ అంటూ అనురాగ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఇక మరో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా విరుచుకుపడ్డారు. ‘‘తాము ఎన్నుకున్న ప్రతినిధుల విషయంలో ప్రేరణగా ఉంటారు. సోనియా గాంధీ రెండు మోతాదుల వ్యాక్సిన్ తీసుకున్నారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని రాయబరేలీ ప్రజలకు పిలుపునివ్వాలి’’ అని హర్దీప్ పూరీ పేర్కొన్నారు. ఇక కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా సోనియా గాంధీని తూర్పూరా బట్టారు. ‘‘కోవిడ్ వ్యాక్సిన్ పై కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తప్పుడు ప్రచారాలు చేసి, ప్రజలను భయానికి గురిచేశాయి. ఓటర్లను సొంత మనుషులుగా సోనియా ఎప్పుడూ భావించలేదు. రాజకీయ లాభాల కోసమే వారిని వినియోగించుకున్నారు’’ అంటూ స్మృతి ఇరానీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 

Updated Date - 2021-06-20T02:56:28+05:30 IST