Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 18 2021 @ 15:10PM

కేంద్రం పాలసీ ఏంటి..? రైతులను బతకనిస్తారా.. లేదా..?: కేసీఆర్‌

హైదరాబాద్: కేంద్రం పాలసీ ఏంటి..? రైతులను బతకనిస్తారా.. లేదా..? అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. గురువారం ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ మహాధర్నాలో  కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో పండించే వడ్లు కొంటరా.. లేదా..? అని ప్రశ్నించారు. ఈ గోస తెలంగాణలోనే కాదని, దేశమంతా ఉందని చెప్పారు. పంటలు కొనేందుకు కేంద్రానికి భయమన్నారు. ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదని హెచ్చరించారు. తెలంగాణ రైతాంగ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ ధ్వజమెత్తారు. రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. హంగర్‌ ఇండెక్స్‌లో దేశం 101 స్థానంలో ఉందని తెలిపారు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ కన్నా దీన స్థితిలో భారత దేశం ఉందని కేసీఆర్ చెప్పారు. 


‘‘కేంద్రం కళ్లు తెలిపించడానికే యుద్ధానికి శ్రీకారం చుట్టాం. దేశాన్ని పాలిస్తున్న నేతలు వితండవాదాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న వారు ధర్నా ఎలా చేస్తారని అంటున్నారు. గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు మోదీ ధర్నా చేయలేదా? సీఎంలు ధర్నాలు చేయకుండా పాలించే బాధ్యత కేంద్రానిదే. కేంద్రం సమస్యను పరిష్కరిస్తే ధర్నాల అవసరం ఉండదు’’ కేసీఆర్‌ పేర్కొన్నారు.


Advertisement
Advertisement