కొవిడ్‌తో మృతిచెందిన బీసీల కుటుంబాలకు ఆసరా

ABN , First Publish Date - 2021-06-17T07:05:41+05:30 IST

కరోనాతో కుటుంబంలో ప్రధాన సంపాదదారుడ్ని కోల్పోయిన వెనుకబడిన తరగతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఆసరాగా నిలిచింది.

కొవిడ్‌తో మృతిచెందిన   బీసీల కుటుంబాలకు ఆసరా

కొవిడ్‌తో మృతిచెందిన 

బీసీల కుటుంబాలకు ఆసరా

ఎన్‌బీసీఎఫ్‌డీసీ ద్వారా కేంద్రం ఆర్థిక సాయం 

22లోగా దరఖాస్తు చేసుకోవాలి 

ఒంగోలు నగరం, జూన్‌ 16 : కరోనాతో కుటుంబంలో ప్రధాన సంపాదదారుడ్ని కోల్పోయిన వెనుకబడిన తరగతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఆసరాగా నిలిచింది.   వారికి ఆర్థిక చేయూత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. కరోనా తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో అనేకమంది మృత్యువాతపడ్డారు. పేదల్లో కుటుంబ పోషకుడు చనిపోతే సభ్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి బీసీ కుటుంబాలకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా ఎన్‌బీసీఎఫ్‌డీసీ పఽథకం కింద ఆర్థిక సహాయాన్ని  ఇచ్చి ఆదుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షలు అందజేయనుంది. ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఎస్సీలకు కూడా సహాయం చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. తాజాగా బీసీలకు కూడా సహాయాన్ని ప్రకటించింది. బాధిత కుటుంబాల వారు ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్ల ద్వారా ఈనెల 22వతేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని బీసీ కార్పొరేషన్‌ ఈడీ వెంకటేశ్వరరావు తెలిపారు.  



Updated Date - 2021-06-17T07:05:41+05:30 IST