ఉపాధి పనులను తనిఖీ చేసిన కేంద్ర బృందం

ABN , First Publish Date - 2022-01-21T06:00:15+05:30 IST

మండలంలో 2021 వరకు జరిగిన ఉపాధి హామీ పనులు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన బలహీనవర్గాల పక్కాగృహాలను గురువారం కేంద్ర బృందం సభ్యులు ప్రదీప్‌ సాల్వే, రామేశ్వర్‌ కలేవాలే పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు.

ఉపాధి పనులను తనిఖీ చేసిన కేంద్ర బృందం
చిన్నంపేట సచివాలయంలో గ్రామసభ

చాట్రాయి జనవరి 20 : మండలంలో  2021 వరకు జరిగిన ఉపాధి హామీ పనులు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన బలహీనవర్గాల పక్కాగృహాలను గురువారం కేంద్ర బృందం సభ్యులు ప్రదీప్‌ సాల్వే, రామేశ్వర్‌ కలేవాలే  పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. చిన్నంపేట, పోతనపల్లి, చనుబండ గ్రామ సచివాలయాల్లో గ్రామసభలు నిర్వహించారు. చేసిన పనులకు సకాలంలో వేతనాలు వస్తున్నాయా, మధ్యవర్తులు ఏమైనా వసూళ్లకు పాల్పడుతున్నారా, వేతనాలు ఎన్ని రోజుల్లో బ్యాంకు ఖాతాలలో జమ అవుతున్నాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వరరావు, అడిషనల్‌ పీడీ జనార్దన్‌, ఏపీడీ రమణారావు, సర్పంచ్‌ పరసా ధనలక్ష్మి, పీఏసీఎస్‌ అధ్యక్షుడు చెన్నారావు, ఎంపీటీసీ  సభ్యురాలు మిద్దేరాధ, ఏపీవో మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-21T06:00:15+05:30 IST