Advertisement
Advertisement
Abn logo
Advertisement

నెల్లూరు జిల్లాలో కేంద్ర బృందాల పర్యటన

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో రెండు కేంద్ర బృందాలు ఆదివారం పర్యటించాయి. దెబ్బతిన్న నిర్మాణాలు, రోడ్లు, పంటలు, ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నాయి. ఒక బృందం తిరుపతి నుంచి జిల్లాకు చేరుకోగా, మరో బృందం కడపలో పర్యటన ముగించుకొని వచ్చింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అండర్‌ సెక్రటరీ అనీల్‌కుమార్‌సింగ్‌, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్‌సింగ్‌, ఆర్థిక శాఖ డైరెక్టర్‌ అభయ్‌కుమార్‌లు మొదటి బృందంలో సభ్యులు కాగా, రెండో బృందంలో కేంద్ర హోంశాఖ పరిధి లోని ఎన్‌డీఎంఏ అడ్వైజర్‌ కునాల్‌ సత్యార్థి, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ డీజేడీ డైరెక్టర్‌ కే మనోహరన్‌, కేంద్ర విద్యుత్‌శాఖ డైరెక్టర్‌ శివన్‌ శర్మ, కేంద్ర జలవనరుల శాఖ ఎస్‌ఈ శ్రీనివాసు బైరీలు సభ్యులుగా ఉన్నారు. ఒక కేంద్ర బృందం జిల్లాలోని తూర్పు ప్రాంతాల్లో పర్యటించగా, రెండో బృందం పశ్చిమ ప్రాంతంలో పర్యటించింది. 

Advertisement
Advertisement