సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో అడుగడుగునా బారికేడ్లు

ABN , First Publish Date - 2021-05-14T07:32:16+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్‌ మఽధ్యలో నిర్మిస్తున్న సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు పరిధిలో అడుగడుగునా బారికేడ్లను పెట్టారు. రాష్ట్రపతి భవన్‌, పాత పార్లమెంట్‌ భవనం...

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో అడుగడుగునా బారికేడ్లు

న్యూఢిల్లీ, మే 13 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్‌ మఽధ్యలో నిర్మిస్తున్న సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు పరిధిలో అడుగడుగునా బారికేడ్లను పెట్టారు. రాష్ట్రపతి భవన్‌, పాత పార్లమెంట్‌ భవనం, రైల్‌ భవన్‌, విజయ్‌ చౌక్‌, ఇండియా గేట్‌ పొడవునా అనేక చోట్ల భారీగా వెదురుతో ప్రహరీ గోడల్ని, కంచెల్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు పరిధిలో వీడియోలు, ఫొటోలు తీయరాదంటూ బోర్డులు పెట్టారు. కాగా సెంట్రల్‌ విస్టా పనిని నిలిపివేయాలంటూ గతంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొవిడ్‌ కారణంగా తాత్కాలికంగా నైనా పనులను నిలిపివేయాలన్న తాజా పిటిషన్‌ సుప్రీం పరిశీలనలో ఉన్నది.

Updated Date - 2021-05-14T07:32:16+05:30 IST