ఆకస్మిక వరదలపై పరిస్థితిని సమీక్షిస్తున్నాం: మోదీ

ABN , First Publish Date - 2021-07-28T19:57:04+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్వర్, కార్గిల్‌లో ఆకస్మిక వరదలపై పరిస్థితిని ఎప్పటికప్పుడు..

ఆకస్మిక వరదలపై పరిస్థితిని సమీక్షిస్తున్నాం: మోదీ

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్వర్, కార్గిల్‌లో ఆకస్మిక వరదలపై పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు ఓ ట్వీట్‌లో ప్రధాని పేర్కొన్నారు. దీనికి ముందు, కిష్ట్వర్‌లో పరిస్థితిపై లెఫ్టినెంట్ గవర్నర్, జమ్మూకశ్మీర్ డీజీపీతో మాట్లాడినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు.


కాగా, ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారిని కాపాడేందుకు ఆర్మీ, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దింపినట్టు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మీడియాకు తెలిపారు. గులాబ్‌గఢ్ ప్రాంతంలో బుధవారం ఉదయం మెరుపు వరదలు ముంచెత్తడంతో 30 నుంచి 40 మంది జాడ గల్లంతైందని, నాలుగుకు పైగా మృతదేహాలను వెలికి తీశారని కిష్ట్వర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ తెలిపారు. హాంజర్ గ్రామంలో తొమ్మిది ఇళ్లు ధ్వంసమయ్యారు. సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నట్టు చెప్పారు.

Updated Date - 2021-07-28T19:57:04+05:30 IST