ఢిల్లీలో విద్యుత్ కొరత లేదన్న కేంద్రం...ఫ్యాక్ట్ షీట్ విడుదల

ABN , First Publish Date - 2021-10-12T18:08:47+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో విద్యుత్ కొరత లేదని కేంద్రం మంగళవారంనాడు తెలిపింది. తమకు అందిన సమాచారం ప్రకారం

ఢిల్లీలో విద్యుత్ కొరత లేదన్న కేంద్రం...ఫ్యాక్ట్ షీట్ విడుదల

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విద్యుత్ కొరత లేదని కేంద్రం మంగళవారంనాడు తెలిపింది. తమకు అందిన సమాచారం ప్రకారం ఢిల్లీ డిస్కామ్‌లు తగిన మొత్తంలో విద్యుత్ సరఫరా చేసినట్టు విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత రెండు వారాలుగా ఢిల్లీలో విద్యుత్ సరఫరా పొజిషన్‌కు వివరాలను కూడా కేంద్రం షేర్ చేసింది. ఆదివారంనాడు ఢిల్లీ గరిష్ట డిమాండ్ 4,536 మెగావాట్లుగా ఉందని తెలిపింది. గత రెండు వారాల్లో సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించిన వాస్తవపట్టి (ఫ్యాక్ట్ షీట్)ను కూడా కేంద్రం విడుదల చేసింది. ఆ ప్రకారం సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకూ డిమాండ్‌కు తగిన సరఫరా జరిగినట్టు పేర్కొంది.


దేశవ్యాప్తంగా థర్మల్ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయంటూ ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో కేంద్రం అప్రమత్తమై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తోంది. ఆందోళన అవసరం లేదని, విద్యుత్ ఉత్పత్తికి సరిపడా వనరులు ఉన్నాయని చెబుతోంది.

Updated Date - 2021-10-12T18:08:47+05:30 IST