నీట్‌లో ఓబీసీ కోటాపై కేంద్రానికి నోటీసులు

ABN , First Publish Date - 2021-09-18T08:11:27+05:30 IST

నీట్‌ అడ్మిషన్లలో ఓబీసీలకు 27 శాతం, ఆర్థిక బలహీన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్‌) 10 శాతం రిజర్వేషన్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన తాజా వ్యాజ్యంపై సుప్రీంకోర్టు కేంద్రం...

నీట్‌లో ఓబీసీ కోటాపై కేంద్రానికి నోటీసులు

  • ఎంసీసీ సమాధానం కోరిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: నీట్‌ అడ్మిషన్లలో ఓబీసీలకు 27 శాతం, ఆర్థిక బలహీన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్‌) 10 శాతం రిజర్వేషన్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన తాజా వ్యాజ్యంపై సుప్రీంకోర్టు కేంద్రం, మెడికల్‌ కౌన్సిలింగ్‌ కమిటీ(ఎంసీసీ)లకు నోటీసులిచ్చింది. దీనికి సమాధానమివ్వాల్సిందిగా న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఎనిమిది మంది పిటిషనర్లు కలిసి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్లలో కొంతమంది త్వరలో నీట్‌ పీజీ పరీక్షలు కూడా రాయనున్నారు. ఇదే అంశంపై గతంలో కూడా కొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఓబీసీలు, ఈడబ్ల్యూఎ్‌సలకు కోటా కల్పిస్తూ జూలై 29న ఇచ్చిన సర్క్యులర్‌ను కొట్టివేయాలని తాజా వ్యాజ్యంలో పిటిషనర్లు కోరారు. 


క్రిమినల్‌ కేసు ఉంటే కొలువుకు అనర్హులు 

క్రిమినల్‌ కేసుతో సంబంధం ఉన్న అభ్యర్థి ఎవరైనా ఆ విషయాన్ని దాచినా, తప్పుడు డిక్లరేషన్‌ ఇచ్చినా ఆ వ్యక్తి ఉద్యోగం పొందేందుకు, అందులో కొనసాగేందుకు ఎలాంటి అర్హత ఉండదని సుప్రీంకోర్టు తెలిపింది.  


కిరాయిదారుకు ఆ హక్కు ఉండదు

ఆస్తి బదిలీ చట్టం కింద ఒక భవనాన్ని కూల్చివేసిన తర్వాత అందులో కిరాయికి ఉంటున్న వ్యక్తి తనకు తిరిగి స్వాధీనం చేయాలని కోరే హక్కు ఉండదని సుప్రీంకోర్టు పేర్కొంది. అద్దె చట్టంలోనే కిరాయిదారుల హక్కులు ఉంటాయే తప్ప ఆస్తి బదిలీ చట్టంతో వారికి ఎలాంటి సంబంధం ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది. 


Updated Date - 2021-09-18T08:11:27+05:30 IST