కోవిడ్ సమయంలో కేంద్రం 700 శాతం ఆక్సిజన్ ఎగుమతులను పెంచింది: ప్రియాంక

ABN , First Publish Date - 2021-07-21T21:12:57+05:30 IST

ఆక్సిజన్ కొరతతో దేశంలో ఏ ఒక్కరూ మరణించలేదంటూ కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో చేసిన..

కోవిడ్ సమయంలో కేంద్రం 700 శాతం ఆక్సిజన్ ఎగుమతులను పెంచింది: ప్రియాంక

న్యూఢిల్లీ: ఆక్సిజన్ కొరతతో దేశంలో ఏ ఒక్కరూ మరణించలేదంటూ కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో చేసిన ప్రకటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. కోవిడ్‌తో దేశం విలవిల్లాడుతున్న సమయలో కేంద్రం ఆక్సిజన్ ఎగుమతులను 700 శాతం పెంచిందని అన్నారు. ఆక్సిజన్ సరఫరాకు ట్యాంకర్లను ఏర్పాట్లు చేయలేకపోవడం వల్ల కోవిడ్ సంబంధిత మరణాలు చోటుచేసుకున్నాయని ఒక ట్వీట్‌లో ప్రియాంక ఆరోపించారు. సాధికారతా గ్రూపు, పార్లమెంటరీ కమిటీ సూచనలు కేంద్రం నిర్లక్ష్యం చేసి ఆక్సిజన్ అందుబాటులోకి తెచ్చేందుకు ఎలాంటి చర్యలూ తీసుకేలేదని, ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు కార్యకలాపాలు ఎక్కడా కనిపించ లేదని ప్రియాంక అన్నారు.


ఏప్రిల్ నుంచి జూన్ వరకూ, మేలో తారాస్థాయికి కోవిడ్ కేసులు పెరిగాయి. ఇదే సమయంలో మరణాలు ఎన్నడూ లేనంత హెచ్చుగా నమోదయ్యాయి. పలు రోజుల పాటు దేశంలో తీవ్ర ఆక్సిజన్ కొరత తలెత్తింది. ప్రైవేటు ఆసుపత్రులు, ఢిల్లీ సర్కార్ సైతం హైకోర్టును ఆశ్రయించాయి. పలువురి పేషెంట్ల మరణాలకు ఆక్సిజన్ కొరత కారణమని వివిధ రాష్ట్రాల్లోని ఆసుపత్రి వర్గాలు ఆరోపించాయి.

Updated Date - 2021-07-21T21:12:57+05:30 IST