ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రైవేటు బ్యాంకుల జోక్యానికి కేంద్రం ఒకే

ABN , First Publish Date - 2021-02-25T03:22:56+05:30 IST

ఈ విషయమై తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా నిర్మలా స్పందిస్తూ ‘‘ప్రభుత్వ వ్యాపారంలో ప్రైవేటు బ్యాంకుల్ని నిషేధించారు. అయితే మేము దీన్ని ఎత్తివేస్తున్నాం. అన్ని బ్యాంకులు స్వేచ్ఛా వాణిజ్యంలో పాల్గొనవచ్చు

ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రైవేటు బ్యాంకుల జోక్యానికి కేంద్రం ఒకే

న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకుల లావాదేవీలతో సహా అనేక అంశాల్లో ప్రైవేటు బ్యాంకుల జోక్యంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రకటించారు. ప్రభుత్వ బ్యాంకుల్లో టాక్స్‌లు, రెవెన్యూ లావాదేవీలు, పెన్షన్ సహా మరిన్ని ఇతర సేవింగ్స్‌లకు సంబంధించి విషయంలో ప్రైవేటు బ్యాంకులు నిర్వహణ చేపట్టవచ్చు. అయితే దీనిపై ఓ వైపు విమర్శలు వస్తుంటే మరోవైపు వినియోగదారుల సౌకర్యార్ధమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.


ఈ విషయమై తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా నిర్మలా స్పందిస్తూ ‘‘ప్రభుత్వ వ్యాపారంలో ప్రైవేటు బ్యాంకుల్ని నిషేధించారు. అయితే మేము దీన్ని ఎత్తివేస్తున్నాం. అన్ని బ్యాంకులు స్వేచ్ఛా వాణిజ్యంలో పాల్గొనవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు బ్యాంకులు కూడా సమాన భాగస్వాములుగా మారవచ్చు. ప్రభుత్వ సామాజిక రంగంలో ఇవి మరిన్ని కార్యక్రమాలను పెంచుతాయి. అంతే కాకుండా వినియోగదారుల సౌలభ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి’’ అని ట్వీట్ చేశారు.

Updated Date - 2021-02-25T03:22:56+05:30 IST