సెంట్రల్‌ విస్టాలో ప్రధాని ఇల్లు

ABN , First Publish Date - 2021-05-04T07:12:18+05:30 IST

దేశంలో కరోనా ఉధృతి ఊహించని స్థాయిలో పెరిగినా సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో ప్రధాని కొత్త నివాస భవన నిర్మాణ పనులను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది...

సెంట్రల్‌ విస్టాలో ప్రధాని ఇల్లు

  • కొత్త నివాస నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా.. వచ్చే ఏడాది డిసెంబరులోగా పూర్తి
  • పర్యావరణ అనుమతులన్నీ జారీ.. కరోనా వేళ సెంట్రల్‌ విస్టా పనులా.. అసంబద్ధ నిర్ణయం: ఏచూరి

న్యూఢిల్లీ, మే 3: దేశంలో కరోనా ఉధృతి ఊహించని స్థాయిలో పెరిగినా సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో ప్రధాని కొత్త నివాస భవన నిర్మాణ పనులను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే పలు భవనాలకు పర్యావరణ అనుమతులు దక్కాయి. మిగిలిన వాటికి కూడా పర్యావరణ అనుమతులు ఇచ్చినట్లు కేంద్ర ప్రజాపనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) తెలిపింది. మోదీ నివాస భవనాన్ని 2022, డిసెంబరులోగా పూర్తి చేస్తామని నిపుణుల మదింపు కమిటీకి వివరించింది. ఉప రాష్ట్రపతి నివాసం 2022, మేలోగా పూర్తి కానుంది. కాగా, కరోనాతో దేశం అతలాకుతలం అవుతున్న వేళ సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును కొనసాగించాలన్న నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది అసంబద్ధ నిర్ణయమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్‌ చేశారు. ఆక్సిజన్‌, వ్యాక్సిన్లను కొనడానికి డ బ్బులేదని, బెడ్ల కోసం ఎదురు చూసి రోగులు చనిపోతున్నారని, మోదీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. 

Updated Date - 2021-05-04T07:12:18+05:30 IST