పెరుగుతున్న కరోనా కేసులు..పంజాబ్‌పై కేంద్రం సీరియస్!

ABN , First Publish Date - 2021-03-30T23:01:27+05:30 IST

పంజాబ్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అక్కడి ప్రభుత్వంపై సీరియస్ అయింది.

పెరుగుతున్న కరోనా కేసులు..పంజాబ్‌పై కేంద్రం సీరియస్!

న్యూఢిల్లీ: పంజాబ్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అక్కడి ప్రభుత్వంపై సీరియస్ అయింది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తగినన్ని ఏర్పాట్లు చేయట్లేదంటూ తీవ్రంగా విమర్శించింది. పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించడంలో, కరోనా బాధితులను క్వారంటైన్ చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించింది. మంగళవారం ఏర్పాటు చేసిన పత్రికా సమవేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రెటరీ రాజేశ్ భూషన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24413 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ‘‘ఫ్రిబవరిలో పంజాబ్‌లో ప్రతిరోజూ సగటున 240 కొత్త కరోనా కేసులు నమోదయ్యేవి. నేడు ఈ సంఖ్య 2742కు చేరుకుంది. దీన్ని బట్టి..వాళ్లు(రాష్ట్ర ప్రభుత్వం) తగినన్ని కరోనా టెస్టులు చేయట్లేదని, కరోనా బాధితులు, అనుమానితులన్ని తక్షణం గుర్తించి క్వారంటైన్ చేయట్లేదని అర్థమవుతోంది’’ అని ఆయన కామెంట్ చేశారు. 

Updated Date - 2021-03-30T23:01:27+05:30 IST