ఎన్‌సీసీ, రెడ్‌క్రా్‌సలతో ‘భారీ సైన్యం’: కేంద్రం

ABN , First Publish Date - 2020-04-09T08:19:12+05:30 IST

కరోనాను ఎదుర్కొనేందుకు క్షేత్రస్ధాయిలో పనిచేసే ఓ భారీ సైన్యాన్ని ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆరోగ్య, పారిశుధ్య, మునిసిపల్‌, పోలీసు, స్వచ్ఛంద సంస్థలకు మద్దతుగా ఈ బృందం పనిచేస్తుందని...

ఎన్‌సీసీ, రెడ్‌క్రా్‌సలతో ‘భారీ సైన్యం’: కేంద్రం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8: కరోనాను ఎదుర్కొనేందుకు క్షేత్రస్ధాయిలో పనిచేసే ఓ భారీ సైన్యాన్ని ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆరోగ్య, పారిశుధ్య, మునిసిపల్‌, పోలీసు, స్వచ్ఛంద సంస్థలకు మద్దతుగా ఈ బృందం పనిచేస్తుందని కేంద్రం పేర్కొంది. ఎన్‌సీసీ, ఎన్‌ఎ్‌సఎస్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ, వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, టెక్నీషియన్లు, ఏఎన్‌ఎమ్‌ (యాగ్జిలరీ నర్సింగ్‌ మిడ్‌వైవ్స్‌), పౌర రక్షక దళాలు, రాష్ట్రప్రభుత్వ అధికారులు శిక్షణ పొంది.. కార్యరంగంలోకి దిగేందుకు సన్నద్ధం కావాలని కోరింది.

Updated Date - 2020-04-09T08:19:12+05:30 IST