టీకా పంపిణిలో అవకతవకలు.. ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ

ABN , First Publish Date - 2021-04-06T02:00:14+05:30 IST

కరోనా టీకా లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరగుతున్నాయంటూ కేంద్రం ఢిల్లీ ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసింది.

టీకా పంపిణిలో అవకతవకలు.. ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ

న్యూఢిల్లీ: కరోనా టీకా లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరగుతున్నాయంటూ కేంద్రం ఢిల్లీ ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసింది. నిబంధనల ప్రకారం 45 ఏళ్లు పైబడిన వారికే టీకా ఇవ్వాల్సి ఉండగా.. అంతకు తక్కువ వయసున్న వారికీ కూడా టీకా అందిన ఉదంతాలు తమ దృష్టికి వచ్చినట్టు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఢిల్లీ ప్రిన్సిపల్ సెక్రెటరీకి లేఖ రాశారు. కరోనా టీకా చాలా విలువైనదని, ఈ అవకతవకలు.. దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమంపై ప్రభావం చూపగలవని పేర్కొంది. ఈ తప్పుడు వ్యవహారం బయటపడ్డ ఆస్పత్రికి షో కాజ్ నోటీస్ జారీ చేయాలని కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఇక ఢిల్లీ ప్రజలకు 24 గంటలూ ప్రజలకు టీకా అందుబాటులో ఉంచేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూడో వంతు రాత్రిళ్లు టీకాలు వేయాలంటూ ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. 

Updated Date - 2021-04-06T02:00:14+05:30 IST