స్మార్ట్ సిటీ కోసం వందల ఏళ్ల నాటి చెట్ల తొలగింపు

ABN , First Publish Date - 2021-12-29T22:06:55+05:30 IST

స్మార్ట్ సిటీ కోసం వందల ఏళ్ల నాటి చెట్ల తొలగింపు

స్మార్ట్ సిటీ కోసం వందల ఏళ్ల నాటి చెట్ల తొలగింపు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం కింద నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బరేలీలోని స్టేడియం రోడ్ వెంట ఉన్న వందల ఏళ్ల చెట్లను తొలగించనున్నారు. ఇందుకు బరేలీ మున్సిపాలిటీకి అటవీశాఖ అనుమతులు కూడా ఇచ్చింది. అయితే బరేలీలోని స్థానికులు మాత్రం ఈ చెట్ల తొలగింపుపై సంతృప్తిగా లేరు. ఎందుకంటే ఇందులోని చాలా చెట్లను వాళ్లు పూజిస్తుంటారు.


మొత్తంగా 100 చెట్లను తొలగించనున్నారు. అయితే ఇందులో 70 చెట్లను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించనున్నారు. అటవీ శాఖ, బరేలీ మున్సిపాలిటీ సంయుక్తంగా ఈ పని చేయనుంది. అయితే కొన్ని చెట్లను వేరే ప్రాంతానికి మార్చడానికి వీలు లేదని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. వందల ఏళ్ల వయసున్న ఈ చెట్లు పరిమాణంలో పెద్దగా ఉండడం వల్ల మరొక చోటికి తరలించడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. మంగళవారం నాటికే కొన్ని చెట్లను తొలగించారు.

Updated Date - 2021-12-29T22:06:55+05:30 IST