పౌష్టికాహారలోపం నివారణకు చిరుధాన్యాలు

ABN , First Publish Date - 2021-10-22T03:38:11+05:30 IST

పిల్లల్లో పౌష్టికా హారలోపం నివారణకు చిరుధాన్యాలు తోడ్పడతాయని జడ్పీటీసీ అరిగెలనాగేశ్వర్‌రావు అన్నారు. జిల్లాకేంద్రం లోని బజార్‌వాడి అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

పౌష్టికాహారలోపం నివారణకు చిరుధాన్యాలు
మాట్లాడుతున్న జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు

- జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు

ఆసిఫాబాద్‌రూరల్‌, అక్టోబరు 21: పిల్లల్లో పౌష్టికా హారలోపం నివారణకు చిరుధాన్యాలు తోడ్పడతాయని జడ్పీటీసీ అరిగెలనాగేశ్వర్‌రావు అన్నారు. జిల్లాకేంద్రం లోని బజార్‌వాడి అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఎక్కువగా గిరిజనపిల్లలు ఉన్నా రని వారిలో పోషకాహార లోపం ఉందన్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం చిరుధాన్యాల పంపిణీ కార్యక్ర మాన్ని ప్రారంభించిందన్నారు. దీనివల్ల పిల్లల్లో పోష కాహార లోపాన్ని తొలగించడమే కాకుండా ఆరోగ్యవం తులను చేసే అవకాశం ఉందన్నారు. ఎంపీపీ మల్లి కార్జున్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, సీడీపీవో రుక్సానా, అంగన్‌వాడీ కార్యకర్తలు మంజుల, శశికళ, రూప పాల్గొన్నారు.

కౌటాల: గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని ఎంపీపీ విశ్వనాథ్‌, సీడీపీవో విజయలక్ష్మి అన్నారు. గురువారం మండలంలోని గుడ్లబోరి గ్రామంలో నిర్వహించిన ఫుడ్‌ఫెస్టివల్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు రాగిజావ, రాగిలడ్డు, రాగిరొట్టె, సామపాయసం,సామ పెరుగన్నం, కొర్రకిచిడి, కొర్రపులిహోర మొదలైనవి తీసు కోవాలన్నారు. చిరుధాన్యాలతో ఎటువంటి ఆహారపదార్థాలు తయారు చేయవచ్చో వివ రించారు. కార్యక్రమంలో వాసన్‌ జిల్లా కోఆర్డి నేటర్‌ సాయినాథ్‌, సర్పంచ్‌లు శ్రీనివాస్‌, నిహారిక, ఎంపీటీసీ వసంత్‌రావు, నాయ కులు పాల్గొన్నారు.

లింగాపూర్‌: చిరుధాన్యాల్లో పోషక విలు వలు ఎక్కువగా ఉంటాయని సీడీపీవో ఇంది రమ్మ అన్నారు. గురువారం మండలం కేంద్రంలో గర్భి ణులు, బాలింతలకు పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాగి, సజ్జ, కొర్ర తదితర చిరుధాన్యాలతో వంటలు తయారు చేసి వాటిలోని పోషక విలువ గురించి వివరించారు. ఎంపీపీ సవిత, సూపర్‌వైజర్‌ లైలా, పెంటుబాయి, కవితరాణి, గోపాలకృష్ణ, సరస్వతీ, బారిక్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T03:38:11+05:30 IST