డీటీఏ, పీఏవోలకు సీఎఫ్‌ఎంఎస్‌ బాధ్యతలు

ABN , First Publish Date - 2021-10-15T07:12:23+05:30 IST

రాష్ట్రంలోని చెల్లింపుల వ్యవస్థ సీఎ్‌ఫఎంఎ్‌సకు సంబంఽధించిన కొన్ని నిర్వహణ బాధ్యతలను ఆర్థిక శాఖ పరిధిలోని డీటీఏ

డీటీఏ, పీఏవోలకు సీఎఫ్‌ఎంఎస్‌ బాధ్యతలు

అమరావతి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని చెల్లింపుల వ్యవస్థ సీఎ్‌ఫఎంఎ్‌సకు సంబంఽధించిన కొన్ని నిర్వహణ బాధ్యతలను ఆర్థిక శాఖ పరిధిలోని డీటీఏ, పీఏవో విభాగాలకు అప్పగిస్తూ ఇటీవల ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది. ఇప్పటి వరకు సీఎ్‌ఫఎంఎ్‌సను ఏపీసీఎ్‌ఫఎ్‌సఎస్‌ నిర్వహించింది. ఏపీసీఎ్‌ఫఎ్‌సఎస్‌ అనేది ప్రభుత్వ శాఖలకు సాంకేతిక సాయం అందించే కార్పొరేషన్‌. ఈ కార్పొరేషన్‌ సీఈఓ సీఎ్‌ఫఎంఎస్‌ నిర్వహణలో ఇప్పటి వరకు కీలకపాత్ర పోషించారు. ఏపీసీఎ్‌ఫఎ్‌సఎస్‌ పరిధిలో ఉండే కొందరు ప్రైవేటు ఉద్యోగులు సీఎ్‌ఫఎంఎస్‌ వ్యవహారాలు ఇతర శాఖలతో సమన్వయం చేసుకునేవారు. ఇప్పుడా బాధ్యతలను డీటీఏ, పీఏవోలకు అప్పగిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఉత్తర్వులిచ్చారు. 

Updated Date - 2021-10-15T07:12:23+05:30 IST