చచ్చినా చావే మరి!

ABN , First Publish Date - 2021-05-14T06:14:36+05:30 IST

భూమి సంద్రమైంది ఒక్కో అలా మనిషిని చుట్టుకున్నట్టు భూమి పొరలుపొరలుగా చీలి ఒక్కొక్కరినీ తనలో విలీనం చేసుకుంటున్నది...

చచ్చినా చావే మరి!

భూమి సంద్రమైంది

ఒక్కో అలా మనిషిని చుట్టుకున్నట్టు

భూమి పొరలుపొరలుగా చీలి

ఒక్కొక్కరినీ తనలో విలీనం చేసుకుంటున్నది

ఉదయం తండ్రి.. రాత్రి తనయుడు

నిన్న భర్త.. నేడు భార్య !


గడప దాటితే చాలు

అక్కడి నుంచి అటే ఆసుపత్రికి

ఆసుపత్రికి వెళితే చాలు

అక్కడి నుంచి అటే రుద్రభూమికి

ఊళ్లకు ఊళ్లు స్మశానవాటికలే


అన్ని ఆస్పత్రుల్లోనూ అంపశయ్యలే

వాటిపై మృత్యువుతో పోరాడుతూ 

అనేకమంది భీష్ములు

మృత్యువేమో ఉత్తరాయణం దాకా వేచిచూడదు


డబ్బులున్నా, పదవులున్నా

అన్నీ అనాథ శవాలే

అన్నీ చాపలో చుట్టేవే

అన్నీ మున్సిపాలిటీ వాళ్లు కాల్చేవే


పరీక్ష కోసం క్యూ

టీకా కోసం క్యూ

బెడ్డు కోసం క్యూ

స్మశానంలోనూ క్యూ

చచ్చినా చావే మరి!!

పీఎస్‌ రవీంద్ర

Updated Date - 2021-05-14T06:14:36+05:30 IST