హిందూ, ముస్లింల మధ్య కొట్లాట సృష్టించేందుకు బీజేపీ యత్నం: చాడ

ABN , First Publish Date - 2021-09-15T16:39:24+05:30 IST

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ హిందూ, ముస్లింల మధ్య...

హిందూ, ముస్లింల మధ్య కొట్లాట సృష్టించేందుకు బీజేపీ యత్నం: చాడ

సిద్దిపేట జిల్లా: రాష్ట్రంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ హిందూ, ముస్లింల మధ్య కొట్లాటను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన హుస్నాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిజాం రజాకార్ల చేతిలో షేక్ బందగి, షోయబుల్లాఖాన్ లాంటి ముస్లింలు హైదరాబాద్ సంస్థానం స్వాతంత్ర్యం కోసం అమరులయ్యారన్నారు. నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన బైరాన్ పల్లి అమరవీరులకు బీజేపీ పిండాలు పెట్టడం కాదని, సాయుధ పోరాటంలో పాల్గొన్న వారికి పింఛన్లు మంజూరు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు గడిచినా... సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేదని, ఎవరికి తొత్తుగా మారిందని ప్రశ్నించారు. దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, లేని పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన చేపడతామన్నారు. దున్నేవాడికే భూమి దక్కే వరకు.. మరో మారు సీపీఐ ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాటాలకు సిద్ధమవుతామని చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2021-09-15T16:39:24+05:30 IST