ఉద్యమాల‌తోనే సమస్యల పరిష్కారం: చాడ వెంకటరెడ్డి

ABN , First Publish Date - 2021-08-16T23:48:49+05:30 IST

ఉద్యమాల‌తోనే సమస్యల పరిష్కారమవుతాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.

ఉద్యమాల‌తోనే సమస్యల పరిష్కారం: చాడ వెంకటరెడ్డి

సిద్దిపేట: ఉద్యమాల‌తోనే సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని శివనుభవా మండపంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి , నిరుద్యోగుల పోరు సదస్సులో పాల్గొన్నారు.  ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా స్వామ్యం నేడు ప్రమాదంలో పడిందన్నారు. కరోనా వచ్చాక ప్రైవేట్ ఉద్యోగాలు పోయాయని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో న్యాయం జరగడం లేదన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎందుకు పూర్తి చేయడం లేదని సీఎం కేసీఆర్‌ని ప్రశ్నించారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసింది విద్యార్థులేనని నేడు వారికి అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఉద్యోగాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  వెంటనే సీఎం కేసీఆర్ ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు, హుజూరాబాద్‌లోనే కాదు రాష్ట్రమంతా దళిత బందు ఇవ్వాలని కోరారు. లేకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. 

Updated Date - 2021-08-16T23:48:49+05:30 IST