Abn logo
Nov 30 2020 @ 22:33PM

బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరం: ఎస్సై

మక్తల్‌రూరల్‌, నవంబరు 30: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేర మని ఎస్సై ఎ.రాములు అన్నారు. సోమవారం మండలంలోని గుడిగండ్ల గ్రా మంలో జిల్లా కళాజాతా బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మహిళల సమస్యల పరిష్కా రానికి ప్రతి గ్రామంలో మీనేస్తం బాక్సులు ఏర్పాటు చేశామన్నారు. అలాగే మూఢనమ్మకాలు, అంటరానితనం, కరోనా వ్యాప్తి తదితర అంశాలపై ప్రజలకు ఆటపాటల ద్వారా కళాబృందం సభ్యులు అవగాహన కల్పించారు. కార్యక్రమం లో సర్పంచ్‌ మహేశ్వరి, ఎంపీటీసీసభ్యురాలు లక్ష్మి, గ్రామపెద్దలు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement