Advertisement
Advertisement
Abn logo
Advertisement

Chain snatchers అరెస్టు

హైదరాబాద్/హైదర్‌నగర్‌: నిర్మానుష్య ప్రాంతంలో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన నలుగురు దుండగులను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం కేపీహెచ్‌బీ పోలీ‌స్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ చంద్రశేఖర్‌ వివరాలు వెల్లడించారు. కేపీహెచ్‌బీ కాలనీ రోడ్‌నెంబర్‌-2 రత్న జువెలరీ షోరూంలో పనిచేసే సంతో్‌షనాయక్‌ ఈనెల 20న కళామందిర్‌ రోడ్డులోని నిర్మానుష్య ప్రదేశంలో బహిర్భూమికి వెళ్లాడు. అక్కడ అతడిపై నలుగురు దుండగులు దాడిచేసి అతని మెడలో ఉన్న 12 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం ఉదయం కేపీహెచ్‌బీ కాలనీ టెంపుల్‌బస్టా్‌పలో ద్విచక్రవాహనంపై వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించిన గోవింద్‌సింగ్‌, దంతం నవీన్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం ఒప్పుకోవడంతో వారికి సహకరించిన రాంబాబు, నవీన్‌లను కూడా అరెస్టు చేసి వారి నుంచి బంగారు గొలుసు స్వాధీనం చేసుకుని ద్విచక్రవాహనాన్ని సీజ్‌ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement