Abn logo
Sep 25 2021 @ 00:47AM

నగర శివారులో చైనస్నాచింగ్‌.. పోలీసుల అదుపులో నిందితులు

అనంతపురం క్రైం, సెప్టెంబరు 24 : నగర శివారులోని రాఘవేంద్ర కాలనీలో  శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో చైనస్నాచింగ్‌ జరిగినట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు. ఉపాధ్యాయుడు గుగ్గిల్లా సుబ్బిరెడ్డి భార్య ఒంటరిగా కళ్యాణదుర్గంరోడ్డులోని గిరియమ్మ దేవాలయానికి  వెళ్లి  ఇంటికి వస్తుండగా ఇద్దరు దుండగులు బైక్‌లో వచ్చి ఆమె మెడలోని 1.5  తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. ఆమె ఫిర్యాదుమేరకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా దుండగులు ఉరవకొండ వైపు వెళ్తుండగా ముద్దలాపురం సమీపంలో కూడేరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.