విశాఖ గాజువాకలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

ABN , First Publish Date - 2020-08-14T04:40:35+05:30 IST

విశాఖ గాజువాకలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

విశాఖ గాజువాకలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

విశాఖ: గాజువాక ఉడాకాలనీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. బైక్ పై వచ్చిన దుండగులు నడిచి వెళ్తున్న మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లారు. దీంతో ఆమె న్యూపోర్టు పోలీస్టేషనులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు స్థానిక సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, దొంగలు ఇళ్లలో కూడా చోరీలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-08-14T04:40:35+05:30 IST