సంపూర్ణ మద్యనిషేధం వైపు అడుగులు : చైర్మన్‌

ABN , First Publish Date - 2020-06-01T10:31:42+05:30 IST

రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం కోసం సీ ఎం జగన్‌ చర్యలు తీసుకుంటున్నారని, అందులో భాగంగానే స్పెషల్‌

సంపూర్ణ మద్యనిషేధం వైపు అడుగులు : చైర్మన్‌

ఒంగోలు, మే 31 (క్రైం) : రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం కోసం సీ ఎం జగన్‌ చర్యలు తీసుకుంటున్నారని, అందులో భాగంగానే స్పెషల్‌ ఇ న్విస్టిగేషన్‌ బ్యూరోను ఏర్పాటు చేశారని మద్యవిమోచన ప్రచార కమిటీ చై ర్మన్‌ వల్లంరెడ్డి లక్ష్మణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఒంగోలులోని ఎక్సై జ్‌శాఖ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రంలో ఎస్‌ఈబీ 485 కేసు ల్లో 95 మందిపై కేసులు నమోదు చేసి 730వాహనాలను సీజ్‌ చేసింద న్నారు. మద్యం, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారి కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 15డీ అడిక్షన్‌ కేంద్రాలను ప్రారంభించామని, మరో పది కేంద్రా లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ కమిష నర్‌ కె.శ్రీమన్నారాయణ, ఎస్‌ఈబీ ప్రత్యేక అధికారి టి.రాజేందర్‌రావు, అద నపు కమిషనర్‌ శ్రీనివాసచౌదరి పాల్గొన్నారు.

Updated Date - 2020-06-01T10:31:42+05:30 IST