ముక్కంటి సేవలో గ్లోబల్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌

ABN , First Publish Date - 2022-01-20T06:09:29+05:30 IST

వాయులింగేశ్వరుడి దర్శనార్థం గ్లోబల్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ రవీంద్రనాథ్‌ శ్రీకాళహస్తి విచ్చేశారు.

ముక్కంటి సేవలో గ్లోబల్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌
ముక్కంటి అన్నదాన పథకానికి విరాళం అందజేస్తున్న డాక్టర్‌ రవీంద్రనాథ్‌

శ్రీకాళహస్తి, జనవరి 19: వాయులింగేశ్వరుడి దర్శనార్థం బుధవారం గ్లోబల్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ రవీంద్రనాథ్‌ శ్రీకాళహస్తి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి ముక్కంటి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధి చేరుకున్న ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ముక్కంటి నిత్యాన్నదాన పథకానికి గ్లోబల్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ రూ.50వేలు విరాళంగా అందజేశారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా స్వామి దర్శనార్థం విచ్చేశారు. కార్యక్రమంలో బియ్యపు ఆకర్ష్‌రెడ్డి, ఆలయ అధికారులు నాగభూషణం యాదవ్‌, హరిబాబు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T06:09:29+05:30 IST