Abn logo
May 8 2020 @ 10:56AM

చైత‌న్య రిస్క్ చేస్తాడా?

యువ క‌థానాయ‌కుడు అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోంద‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ఓ హార‌ర్ సినిమా అని అంటున్నారు. వివ‌రాల్లోకెళ్తే.. మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ‘13 బీ’ అనే సినిమా రూపొంది ఘ‌న విజ‌యం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్‌ను విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించ‌నున్నాడ‌ని, అందులో చైతన్య హీరోగా నటిస్తాడని టాక్‌. అయితే హారర్ చిత్రాలు చూడాలంటేనే భయపడే చైతన్య మరి.. వాటిలో నటిస్తాడా?  రిస్క్ చేస్తాడా? అనేది ప్ర‌శ్నార్థ‌క‌మే. మ‌రి చైత‌న్య‌, విక్ర‌మ్‌ కాంబినేష‌న్‌లో హార‌ర్ సినిమా రూపొందనుంద‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజమెంత‌? అనే విష‌యం తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. 

Advertisement
Advertisement
Advertisement