చాయ్‌వాలా కూతురు ఎయిర్‌ ఫోర్స్‌కి ఎంపిక

ABN , First Publish Date - 2020-06-24T07:04:31+05:30 IST

సాధించాలనే తపన ఉంటే ఎన్ని అడ్డంకులెదురైనా అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిరూపించారు 24 ఏళ్ల అంచల్‌ గంగ్వాల్‌. భారత వైమానిక దళంలో ఫ్లయింగ్‌ ..

చాయ్‌వాలా కూతురు ఎయిర్‌ ఫోర్స్‌కి ఎంపిక

భోపాల్‌, జూన్‌ 23: సాధించాలనే  తపన ఉంటే ఎన్ని అడ్డంకులెదురైనా అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిరూపించారు 24 ఏళ్ల అంచల్‌ గంగ్వాల్‌. భారత వైమానిక దళంలో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా ఎంపికై చదువుకి పేదరికం అడ్డురాదని మరోసారి నిరూపించారు. అపజయాలు ఎన్ని ఎదురైనా చలించక అనుకున్నది సాధించారు. మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌ జిల్లాలో అంచల్‌ గంగ్వాల్‌ కుటుంబం నివసిస్తోంది.


కుటుంబ పోషణ కోసం అంచల్‌ తండ్రి సురేష్‌ గంగ్వాల్‌  స్థానిక బస్టాండ్‌లో టీ విక్రయిస్తుంటారు. అంచల్‌ చదువుతోపాటు ఆటల్లోనూ రాణించారు. ఆమె మంచి బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌ కూడా. 2013లో కేదార్‌నాథ్‌ దుర్ఘటన సమయంలో భారత వైమానిక, సైనిక సిబ్బంది అందించిన సేవలను చూసి అంచల్‌ స్ఫూర్తి పొందారు. తాను కూడా వైమానిక దళంలో చేరాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. పట్టువదల కుండా కృషి  చేశారు. ఆరో ప్రయత్నంలో విజయం సాధించారు. హైదరాబాద్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా శిక్షణ ముగించుకున్న అంచల్‌ ఉత్తమ క్యాడటెట్‌గా నిలిచారు. ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ చేతుల మీదుగా ‘ప్రెసిడెంట్స్‌ ప్లాక్‌’ అవార్డును అందుకున్నారు.

Updated Date - 2020-06-24T07:04:31+05:30 IST