Abn logo
Sep 27 2020 @ 07:13AM

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు ఘన నివాళి

Kaakateeya

ఆసిఫాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు26: ఆసిఫాబాద్‌ పట్టణంలో శనివారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్‌నార్‌ రమేష్‌ మాట్లాడుతూ చాకలి అయిలమ్మ భూమి కోసం భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడారని పేర్కొన్నారు. అంతకు ముందు ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు రాధిక, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

రెబ్బెన: రెబ్బెన మండల కేంద్రంతో పాటు గోలేటి టౌన్‌ షిప్‌లో   చాకలి ఐలమ్మ 125వ జయంతి వేడుకలను రజకసంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రజకసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కడతల మల్లయ్య మాట్లా డుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన ఘనత చాకలి అయిలమ్మదన్నారు. ఆమెను స్పూర్తిగా తీసుకుని నేడు తెలంగాణ ప్రజలు హక్కుల సాధనకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు సుధాకర్‌, విజయ్‌కుమార్‌, శ్రీను, రవి, తిరుపతి, రాజు, శంకర్‌, దేవాజీ, సాయికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

తిర్యాణి: చాకలి ఐలమ్మ జయంతిని తిర్యాణి మండలంలో శణివారం ఘనంగా జరుపుకున్నారు. రజక సంఘం ఆధ్వర్యంలో కుమరం భీం కాంప్లెక్స్‌ నుంచి స్థానిక కుమురం భీం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో ఏర్పాటు చేసిన చాకలి అయిలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కడతల మల్లయ్య, జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్‌, ఎంపీపీ శ్రీదేవి, ఎంపీటీసీ రాజయ్యలక్ష్మి, ఉప సర్పంచ్‌ లచ్చన్న, ప్రవీణ్‌, వెంకన్న, తాళ్ల శ్రీనివాస్‌గౌడ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ మండలా ధ్యక్షుడు శంకర్‌గౌడ్‌, తుడుందెబ్బ నాయకులు భగవంతరావు, బిరుదుగోండ్‌ తోటి సంఘం నాయకులు తిరుపతి, రజక సంఘం నాయకులు జగదీష్‌, రాజు, మధుకర్‌, రాజమల్లు, సంతోష్‌, మల్లేష్‌, పున్నంకుమార్‌, మహేష్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement