Abn logo
Sep 27 2021 @ 01:04AM

చాకలి ఐలమ్మకు ఘన నివాళి

నివాళి అర్పిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

 (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. అధికారికంగా ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించారు. తంగళ్లపల్లి మండలంలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్రలో బద్దెనపల్లి వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేశారు. జిల్లా కలెక్టరేట్‌లో బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, ఆర్డీవో శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య,  రైతు బంధు సమితి కో ఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య, బీసీ అభివృద్ధి శాఖ అఽధికారి మోహన్‌రెడ్డి, జిల్లా రజక సంఘం అధ్యక్షుడు నాంపల్లి, ఉపాధ్యక్షుడు మహేందర్‌, వర్కింగ్‌ అధ్యక్షుడు సతీష్‌ చాకలి ఐలమ్మ చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళి తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ సమాజంలోని బానిస, వెట్టి చాకిరి వ్యవస్థ  నుంచి విముక్తి కోసం పోరాటాలు చేశారన్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని చాటుతూ ఈ సంవత్సరం నుంచి చాకలి ఐలమ్మ వర్ధంతి, జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లా కలెక్టర్‌  అనురాగ్‌ జయంతి మాట్లాడతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సబ్బండ వర్గాల అత్మగౌరవ ప్రతీకగా నిలిచారన్నారు.  రజకుల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటును అందిస్తోందన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో భాగంగా ఎస్పీ రాహుల్‌హెగ్డే ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు.