బాలీవుడ్ నటులు రాజ్‌కుమార్ రావు, నుష్రత్ భరూచా జంటగా నటించిన అమెజాన్ ఒరిజినల్ మూవీ ‘ఛలాంగ్’ అఫీషియల్ ట్రైలర్ శనివారం విడుదలైంది. రాజ్‌కుమార్ రావు వ్యాయామ ఉపాధ్యాయుడు పాత్రలో నటించారు.
మహమ్మద్ జీషాన్ ఆయూబ్, రాజ్కుమార్రావుల మధ్య పీటీ ఉద్యోగం కోసం పోటీ పెరుగుతుంది. ఆ సందర్భంలో తలెత్తే పరిణామాల నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇందులో కంప్యూటర్ టీచర్ నీలూగా నుష్రత్ నటించారు. హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 13న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవనుంది.