కోవిడ్ తగ్గిన తర్వాత ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం: చలసాని శ్రీనివాస్

ABN , First Publish Date - 2021-06-21T16:44:35+05:30 IST

ప్రత్యేక హోదా కోసం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తాము పోరాటాలు చేస్తామని..

కోవిడ్  తగ్గిన తర్వాత  ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం: చలసాని శ్రీనివాస్

విశాఖ: ప్రత్యేక హోదా కోసం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తాము పోరాటాలు చేస్తామని  ప్రత్యేక హోదా.. విభజన హామీల సాధనా సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతమంది కావాలనే సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కోవిడ్  తగ్గిన తర్వాత మళ్లీ  ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్ ప్రత్యేక హోదాను ఇంకా అడుగుతామనే చెబుతున్నారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిందని ఎన్నాళ్లు అడుగుతారని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.


గతంలోనూ కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమేని,  ఇప్పుడున్న కేంద్రప్రభుత్వం కూడా ఒక విధంగా సంకీర్ణ ప్రభుత్వమేనని చలసాని అన్నారు. ప్రత్యేకహోదా కోసం ఏపీ ఎంపీలు చేయాల్సింది రాజీనామా కాదని, ప్రధాని మోదీ ఇంటి ముందు పోరాటం చేయాలని సూచించారు. గంగవరం పోర్ట్ ఆదాని గ్రూప్‌కు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ఇది ఆంధ్ర రాష్ట్రామా? ఆదాని రాష్ట్రామా? లేక  అంబానీ రాష్ట్రమా? అని నిలదీశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు బ్యాలన్స్గా, ఉండాలన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధి వదిలేశారని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఎవరు మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం ఎంతో మంది నిరుద్యోగులు ఆశలపై నీళ్లు చెల్లిందని చలసాని శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

Updated Date - 2021-06-21T16:44:35+05:30 IST