చాణక్య నీతి: ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. ఈ పని అస్సలు చేయవద్దు.. లేదంటే తర్వాత పశ్చాత్తాప పడతారు!

ABN , First Publish Date - 2021-11-07T12:51:02+05:30 IST

మనిషి జీవితం ఎంతో అమూల్యమైనదని చాణక్య నీతి చెబుతోంది.

చాణక్య నీతి: ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. ఈ పని అస్సలు చేయవద్దు.. లేదంటే తర్వాత పశ్చాత్తాప పడతారు!

మనిషి జీవితం ఎంతో అమూల్యమైనదని చాణక్య నీతి చెబుతోంది. అందుకే జీవితం యొక్క గొప్పతనాన్ని అందరూ తెలుసుకోవాలని చాణక్య నీతి సూచిస్తోంది. లేదంటే కష్టాల్లో చిక్కుకుని, నష్టాలపాలవుతారని చాణక్య నీతి చెబుతోంది. జీవితానికున్న గొప్పతనాన్ని తెలుసుకున్నవారే ఆనందంగా మనుగడ సాగించగలరని ఆచార్య చెబుతారు. అటువంటి వారి దగ్గరే లక్ష్మీదేవి నివసిస్తుందని చాణక్య తెలిపారు. కొన్ని విషయాల్లో  ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఆ పనులను చేయకూడదని చాణక్య నీతి సూచిస్తోంది. ఆ పనులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


చాణక్యనీతిలో తెలిపిన వివరాల ప్రకారం ఎవరైనా సరే తన లక్ష్య సాధన విషయంలో కఠినంగా వ్యవహరించాలి. ఎటువంటి వెనుకడుగు వేయకూడదు. అంకితభావంతో లక్ష్యం కోసం పనిచేయాలి. అప్పుడే దానిని అందుకునే ఓర్పు, నేర్పు వస్తాయి. లక్ష్య సాధనలో కఠోర శ్రమ ఎంతో కీలకమైనది. ఈ లక్షణాలను దిగజార్చే ఎటువంటి ప్రలోభాలకు మనిషి లొంగిపోకూడదు. అప్పుడే విజయం వారిని వరిస్తుంది. 

మనిషి స్వార్థ పూరితంగా వ్యవహరించకూడదని చాణక్య నీతి చెబుతోంది. పచ్చిస్వార్థంతో కూడిన వ్యక్తి తన ప్రతిభను ఎక్కడా ప్రదర్శించలేడు. స్వార్థంతో కూడినవారు తమ మూలాలను మరచిపోతుంటారు. సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటారు. స్వార్థంతో కూడిన వ్యక్తి సులభంగా ప్రలోభాలకు లొంగిపోయి, లక్ష్యాన్ని మరచిపోతుంటాడు. విజయాన్ని అందుకునేందుకు తప్పుడు మార్గాలను ఆశ్రయిస్తుంటాడు. ఈ విధంగా అందుకునే విజయం స్థిరంగా ఉండదు. పచ్చిస్వార్థంతో వ్యవహరించేవారికి సమాజంలో గౌరవం కూడా లభ్యంకాదు. విజయాన్ని అందుకోవాలనుకునే వ్యక్తి మంచి గుణాలను కలిగివుండాలని ఆచార్య చాణక్య తెలిపారు. 

Updated Date - 2021-11-07T12:51:02+05:30 IST