మీ జీవితంలోని ప్ర‌తీ క్ష‌ణాన్నీ విజ‌య‌వంతం చేసే ఐదు సూత్రాలు.. ఆచ‌రిస్తే నిరంత‌రం ఆనంద‌మే!

ABN , First Publish Date - 2021-10-23T11:47:42+05:30 IST

మనిషి జీవితంలో రకరకాల సవాళ్ల‌ను ఎదుర్కోవ‌ల‌సి...

మీ జీవితంలోని ప్ర‌తీ క్ష‌ణాన్నీ విజ‌య‌వంతం చేసే ఐదు సూత్రాలు.. ఆచ‌రిస్తే నిరంత‌రం ఆనంద‌మే!

మనిషి జీవితంలో రకరకాల సవాళ్ల‌ను ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంటుంది. అటువంటి స‌మ‌యంలో వాటితో పోరాడే శక్తి మనందరికీ అవ‌స‌ర‌మే. స‌మ‌స్య‌లు ఎదురైన‌పుడు మనం వాటితో ఎలా వ్యవహరిస్తాం? వాటి నుంచి మనం ఏమి నేర్చుకుంటామ‌నేదే కీల‌క‌మ‌ని ఆచార్య చాణ‌క్య తెలిపారు. జీవితంలో మ‌న‌కు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆచార్య చాణ‌క్య‌ చాలాకాలం క్రితమే కొన్ని విధానాల‌ను తెలియ‌జేశారు. మీరు వాటిని ఆచ‌రిస్తే ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి బ‌య‌ప‌డ‌వ‌చ్చు. అలాగే చాలా విలువైన విషయాలు నేర్చుకోవ‌డంతోపాటు, రాబోయే సవాళ్లకు స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమ‌వుతారు. చాణక్యుడి విధానాల‌ను అనుసరించడం ద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా ఆనందం చోటుచేసుకుంటుంద‌ని విశ్లేష‌కులు చెబుతారు.


శాస్త్ర‌ గ్రంథాల ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

శాస్త్రోక్తమైన నీతి సూత్రాలను ఆచరించ‌డం ద్వారా, జ్ఞానాన్ని పొందిన వ్యక్తి ఎంతో విలువైన‌ కర్తవ్య సూత్రాలను తెలుసుకుంటాడు. ఏది ఆచ‌రించాలో, ఏది ఆచ‌రించ‌కూడ‌దో తెలుసుకోగలుగుతాడు. మంచి, చెడుల తేడాను తెలుసుకున్న వ్య‌క్తి ఉత్తమమైన జ్ఞానాన్ని గ్ర‌హించ‌గ‌లుగుతాడు.

డబ్బును పొదుపు చేయాలి

భవిష్యత్‌లో ఎదుర‌య్యే సమస్యలను ఎదుర్కొనేందుకు డబ్బు పొదుపు చేయడం అత్య‌వ‌స‌రం. ధనవంతుడు ఆర్థిక‌ ఇబ్బందుల్లో అంత‌గా చిక్కుకోడ‌ని మీరు అనుకుంటారు క‌దా.. అన‌వ‌స‌రంగా డబ్బు ఖ‌ర్చు పెట్టేస్తుంటే మ‌న‌ద‌గ్గ‌రున్న సంప‌ద వేగంగా త‌రిగిపోతుంది. 

మూర్ఖుల విష‌యంలో జాగ్రత్తగా ఉండండి

మీ ఎదుట ఎన్న‌డూ లేనంత‌ మధురంగా మాట్లాడే వ్యక్తుల ద‌గ్గ‌ర అప్ర‌మ‌త్తంగా ఉండండి. వారు మిమ్మల్ని దిగ‌జార్చేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని గ్ర‌హించండి. ఇలాంటివారు.. పైభాగం పాలతో నిండిన విషపు కుండ లాంటివార‌ని తెలుసుకోండి. మూర్ఱులతో సహవాసం వద్దని ఆచార్య చాణక్య సూచించారు. 


ఎవరిద‌గ్గ‌రా మీరు చేయ‌బోయే ప‌నులు గురించి చెప్ప‌కండి

మీ మనసులో ధృడంగా చేయాల‌నుకున్న పనిని ఎవరికీ చెప్పకండి. అయితే దానిని అమ‌లు చేయ‌డంలో ప్ర‌ణాళికా బ‌ద్ధంగా ప‌నిచేస్తూ, అనుకున్న స‌మ‌యానికి ఆ ప‌నిని పూర్తిచేయండి.

మీకున్న‌ జ్ఞానాన్ని ఉపయోగించండి

మీకున్న‌ జ్ఞానాన్ని ఉపయోగించకపోతే, అది అడుగంటిపోతుంది. అజ్ఞాని అనేవాడు సేనాధిపతి లేని సైన్యంలో భాగ‌స్వామి. అటువంటివాడు ఎప్ప‌టికైనా ఓట‌మిపాల‌వుతాడని ఆచార్య చాణక్య తెలిపారు.

Updated Date - 2021-10-23T11:47:42+05:30 IST