చాణక్య నీతి: అక్రమ సంబంధాలకు మించి భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమివే.. ఈ సూత్రాలు పాటిస్తే స్వర్గమే!

ABN , First Publish Date - 2021-10-31T12:36:42+05:30 IST

భార్యాభర్తల మధ్య గొడవలకు అక్రమ సంబంధాలే..

చాణక్య నీతి: అక్రమ సంబంధాలకు మించి భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమివే.. ఈ సూత్రాలు పాటిస్తే స్వర్గమే!

భార్యాభర్తల మధ్య గొడవలకు అక్రమ సంబంధాలే కారణమని చాలామంది అనుకుంటారు. అయితే వాటికిమించిన మరికొన్ని అంశాలు కూడా భార్యాభర్తల మధ్య గొడవలకు కారణంగా నిలుస్తాయి. దంపతుల మధ్య అనుబంధం మరింత బలపడేందుకు చాణక్య నీతి పలు సూచనలు చేస్తోంది. భార్యాభర్తలు తమ అనుబంధాన్ని ఎంతో ప్రాముఖ్యత కలిగినదిగా గ్రహించాలని చాణక్యనీతి చెబుతోంది. ఇది ఇద్దరి జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తుందని, ఈ అనుబంధంలో ఎప్పుడూ చీలిక రాకూడదని, ఈ అనుబంధం బలహీనపడినప్పుడు వారి జీవితాలకు తీరని నష్టం జరుగుతుందని చాణక్యనీతి చెబుతోంది. ఒకసారి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తితే, అవి సద్దుమణిగేందుకు చాలా సమయం పడుతుందని ఆచార్య చాణక్య తెలిపారు. 


భారతదేశంలోని అత్యుత్తమ పండితులలో ఒకనిగా ఆచార్య చాణక్య గుర్తింపు పొందారు. చాణక్యుని అభిప్రాయం ప్రకారం భార్యాభర్తల మధ్య సంబంధాన్ని దెబ్బతీయడంలో కొన్ని అంశాలు కీలకంగా పనిచేస్తాయి. అవి ఏమిటో.. వాటిని ఎలా చక్కదిద్దవచ్చో చాణక్య తెలియజేశారు.

అనుమానం: భార్యాభర్తల సంబంధాన్ని బలహీనపరచడంలో అనుమానం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చాణక్య తెలిపారు. భార్యాభర్తల మధ్య అనుమానాలు, అపార్థాలు ఉండకూడదని, ఒకసారి వారిమధ్య అనుమానం తలెత్తితే వారి మధ్య వివాదాలు మొదలవుతాయి. ఇద్దరిమధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడంవలనే ఇటువంటి సమస్య తలెత్తుతుంది. అందుకే భార్యాభర్తలిరువురూ అనుమానాలకు తావివ్వకుండా మెలగాలని ఆచార్య చాణక్య సూచించారు. 

అహంకారం: భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలహీనపరచడంలో అహంకారం ముఖ్యపాత్ర పోషిస్తుందని చాణక్య నీతి చెబుతోంది. దంపతులు తమ మధ్య అహంకారం తలెత్తకుండా చూసుకోవాలి. అహంకారం అనేది విషయ పరిజ్ఞానం ద్వారా తొలగిపోతుంది.


అబద్ధాలు: భార్యాభర్తల సంబంధంలో అబద్ధాలకు అవకాశం ఉండకూడదని చాణక్య నీతి చెబుతోంది. భార్యాభర్తల మధ్య అబద్ధాలు ప్రవేశించినప్పుడు.. వారి అనుబంధంలో చీలికలు తలెత్తుతాయి. అందుకే దంపతులు ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాలి. 

గౌరవం లేకపోవడం: భార్యాభర్తల మధ్య సంబంధంలో గౌరవానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చాణక్యనీతి చెబుతోంది. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవభావం లోపిస్తుందో, అప్పుడే వారి మధ్య కలహాలు మొదలవుతాయి. అందుకే దంపతులు పరస్పరం గౌరవ భావాన్ని కలిగివుండాలని చాణక్యనీతి సూచిస్తోంది.



Updated Date - 2021-10-31T12:36:42+05:30 IST