మీకు సంబంధించిన ఈ రహస్యాలను ఎవరికీ చెప్పకండి.. లేకుంటే మీ జీవితం నవ్వుల పాలవుతుంది!

ABN , First Publish Date - 2021-11-14T12:22:06+05:30 IST

ఆచార్య చాణక్య తన తెలివితేటలు, వివిధ విషయాలలో..

మీకు సంబంధించిన ఈ రహస్యాలను ఎవరికీ చెప్పకండి.. లేకుంటే మీ జీవితం నవ్వుల పాలవుతుంది!

ఆచార్య చాణక్య తన తెలివితేటలు, వివిధ విషయాలలో ప్రావీణ్యం కారణంగా ఇప్పటికీ ఉత్తమ పండితునిగా కీర్తినందుకుంటున్నాడు. చాణక్య గొప్ప వ్యూహకర్త, దౌత్యవేత్త గొప్ప ఆర్థికవేత్త. చాణక్యుడు రచించిన అనేక గ్రంథాలు ఇప్పటికీ ఆదరణ పొందుతున్నాయి. ఆయన రచించిన గ్రంథాలలోని నీతిని బోధించే విషయాలు ఇప్పటికీ ప్రజల మనస్సులలో నాటుకుపోయాయి.

ఆచార్య కౌటిల్యునిగా పేరొందిన చాణక్యుడు తెలిపిన నీతి.. చాణక్య నీతిగా రూపుదిద్దుకుంది. ఇందులో మానవ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. జీవితంలో ఈ విషయాలపై శ్రద్ధ వహిస్తే, అనేక సమస్యలను నివారించవచ్చు, జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. చాణక్య నీతిలో పేర్కొన్న వివరాల ప్రకారం కొన్ని విషయాలను ఎవరికీ ఎట్టి పరిస్థితులలోనూ చెప్పకూడదు. ఈ సూత్రాన్ని విస్మరిస్తే జీవితం నవ్వుల పాలవుతుంది. 


భార్యాభర్తల మధ్య విషయాలు:

నీతిశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన వైవాహిక జీవితంలోని విషయాలను ఇతరులతో ఎప్పుడూ పంచుకోకూడదు. భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణను వారిలోనే ఉంచుకోవాలి. ప్రత్యేకించి మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య ఏవైనా గొడవలు ఉన్నట్లయితే.. మీకు నమ్మకమైన స్నేహితుడైనప్పటికీ మూడవ వ్యక్తితో చెప్పకూడదు. దీనిని కాదని ఎవరితోనైనా మీ దాంపత్య విషయాలు చెబితే ఆ తరువాత మీరు గౌరవం కోల్పోవలసి వస్తుంది. అలాగే దాంపత్య జీవితంలో గొడవలు తలెత్తుతాయి. 

మీ పనికి సంబంధించిన ప్లాన్:

ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి తన పనికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు లేదా ప్రణాళికలను ఇతరుల ముందు ప్రస్తావించకూడదు. ఇలా చేస్తే మీరు కార్యాలయంలో నష్టాలను చవిచూడాల్సి రావచ్చు. పనిలో విజయం సాధించే అవకాశాలు తగ్గుతాయి. అందుకే మనం అనుకున్న పని పూర్తయిన తర్వాతే ఎవరికైనా చెప్పాలి.



Updated Date - 2021-11-14T12:22:06+05:30 IST