చాణక్య నీతి: జీవితాన్ని శాసించే డబ్బు, విజయం ఎల్లప్పుడూ మనతో పాటు ఉండాలంటే ఏంచేయాలో తెలుసా?

ABN , First Publish Date - 2021-11-15T12:19:07+05:30 IST

ఆచార్య చాణక్య రచించిన చాణక్య నీతి.. మనిషి తన జీవితంలో..

చాణక్య నీతి: జీవితాన్ని శాసించే డబ్బు, విజయం ఎల్లప్పుడూ మనతో పాటు ఉండాలంటే ఏంచేయాలో తెలుసా?

ఆచార్య చాణక్య రచించిన చాణక్య నీతి.. మనిషి తన జీవితంలో విజయం సాధించేందుకు అవసరమైన అనేక విధానాల గురించి తెలియజేసింది. ఈ విధానాలను చక్కగా అర్థం చేసుకుని జీవితంలో అమలు చేసే వ్యక్తి అనేక సమస్యలను తప్పించుకోగలుగుతాడు.  చాణక్య నీతిలో మనం డబ్బుతో ఎలా వ్యవహరించాలో తెలియజేశారు. డబ్బును ఎలా దాచుకోవాలి? డబ్బును సక్రమంగా ఉపయోగించుకునే మార్గం ఏమిటనే వివరాలు చాణక్యనీతిలో ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. 


సంపదను కూడబెట్టడంతో పాటు దానిని సరైన చోట పెట్టుబడి పెట్టాలని చాణక్య నీతి చెబుతోంది.  అలాగే డబ్బును ఎప్పుడూ గౌరవించాలని కూడా తెలియజేసింది. ఎందుకంటే ఇది మనిషికి సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది, ఆర్థిక సమస్యలను  ఎదుర్కోవడంలో సహాయపడుతుందని చాణక్య నీతి పేర్కొంది.  చాణక్య నీతిలో పేర్కొన్న వివరాల ప్రకారం మనిషి.. ఉద్యోగం, శ్రేయోభిలాషులు, గౌరవం, విద్య అందుబాటులో లేని దేశంలో లేదా ప్రాంతంలో నివసించకూడదు.  మీ చుట్టూ మీకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్న ప్రదేశంలో నివసించడం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చాణక్య నీతి తెలియజేస్తోంది.


డబ్బును తోటివారికి వినియోగపడేలా కూడా ఖర్చుచేయాలని చాణక్య నీతి చెబుతోంది.  అంటే డబ్బును ఇతరుల సంక్షేమం కోసం కూడా ఖర్చుచేయాలి. ఇలా మెలిగేవారికి ప్రతిచోటా గౌరవం లభిస్తుంది.  డబ్బు ఎప్పుడూ భద్రంగా ఉంచుకోవాలి.  ఆడంబరాల కోసం విపరీతంగా ఖర్చు చేయడం మంచిదికాదని చాణక్య నీతి చెబుతోంది. ఇతరుల దగ్గర ఆడంబరాల కోసం డబ్బు ఖర్చు చేస్తే సంపద త్వరగా వృథా అవుతుందని  చాణక్య నీతి సూచిస్తోంది. సంపద ఉందికదా అని అహంకార పడకూడదని చాణక్యుడు చెప్పాడు.  ఎందుకంటే అహంకారం మనిషి మేధస్సును దెబ్బతీస్తుంది. ఫలితంగా మనిషి సంపద త్వరగా ఖర్చయిపోతుంది.  అందుకే అహంకారం చూపడం మానుకోవాలని చాణక్య నీతి చెబుతోంది.  చాణక్య నీతి ప్రకారం తనకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోలేని వ్యక్తి ఏ పనిలోనూ విజయం సాధించలేడు.  అందుకే తొలుత లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. తరువాత దానిని సాధించడానికి ప్రయత్నం చేయండని చాణక్య చెబుతారు. మీరు ఏదైనా పనిని ప్రారంభించబోతున్నట్లయితే, ఖచ్చితంగా ఈ మూడు ప్రశ్నలను వేసుకోవాలని చాణక్య చెబుతారు.. ముందుగా నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను?  ఈ పనికి లభించే ఫలితం ఏమిటి?  నేను దీన్ని చేయగలనా?  అనే ఈ మూడు ప్రశ్నలకు సమాధానం దొరికిన తర్వాతనే పనిని ప్రారంభించాలని ఆచార్య చాణక్య సూచిస్తున్నారు. ఈ విధంగా చేయడం వలన మీ విజయావకాశాలు పెరుగుతాయని చాణక్యనీతి చెబుతోంది.

Updated Date - 2021-11-15T12:19:07+05:30 IST