Advertisement
Advertisement
Abn logo
Advertisement

చాణక్య నీతి: మీలోని ఈ చిన్నతప్పులు మిమ్మల్ని ఆవేదనకు గురిచేస్తాయి.. నిరంతరం అప్రమత్తంగా ఉండండి!

జీవితం ఆనందంగా సాగిపోవాలనేది ప్రతీ ఒక్కరి కల. తమ జీవితంలో ఎలాంటి విషాద ఛాయలు ఉండకూడదని అందరూ కోరుకుంటారు. ప్రతి క్షణం ఆనందంతో సాగిపోవాలని తపన పడతారు. అయితే మన ప్రవర్తన కారణంగా ఇది ఊహకు మాత్రమే పరిమితమైపోతుంది. ఎందుకంటే మన జీవితంలో ఆనందం, దుఃఖం అనేవి నాణేనికి రెండువైపులా ఉండే బొమ్మాబొరుసులాంటివి.  జీవితంలో సుఖం పక్కనే దుఃఖం ఉంటుంది. దుఃఖం పక్కనే ఆనందం కూడా ఉంటుంది. ఆచార్య చాణక్య.. మనిషి సంతోషకరమైన జీవితాన్ని గడిపేందుకు కొన్ని విధానాలు అమూల్యమైన ఆలోచనలను వెలిబుచ్చారు. ఈ ఆలోచనలు ఈ నాటికీ అందరికీ ఉపయుక్తంగా ఉన్నాయి. తప్పును తిరిగి చేయడమే పెద్ద తప్పు అని చాణక్య తెలిపారు.

ఇతరుల కోసం తన ఉనికిని పణంగా పెట్టడం పెద్ద మూర్ఖత్వం అనే అమూల్యమైన విషయాన్ని ఆచార్య తెలిపారు. దీని ద్వారా ఆచార్య.. నమ్మకం, మనిషి ఉనికికి గల ప్రాధాన్యతను తెలియజెప్పారు. మీరు ఎవరికైనా ఎంతటి మేలు చేసినా వారు స్వీకరిస్తారు. ఈ విధంగా మీరు వారికి ఉపయోగపడేంతవరకూ అంతా సవ్యంగానే ఉంటుంది. మీరు వారికి ఉపయోగపడని రోజున వారు మీలోని మంచి గుణాలనన్నింటికీ మరిచిపోయి వారి నిజస్వరూపం చూపిస్తారు. అందుకే మీ ఉనికిని ఇతరులకు పణంగా పెట్టకుండా అప్రమత్తంగా మెలగాలని చాణక్య సూచించారు. ఇక రెండవది.. ఎదుటి మనిషిపై నమ్మకం అనేది కోల్పోయినప్పుడు  బంధాలు మాయమవుతాయని చాణక్య తెలిపారు. తమకు ఆప్తులైన వారిని నమ్మనప్పుడు మనిషి తన ఉనికిని కోల్పోతాడు. చాలామంది ఇదే తప్పును చేస్తారు. ఫలితంగా మూఢనమ్మకాలలో చిక్కుకుంటారు. ఇటువంటి సందర్భాల్లో మనిషి అంతర్గతంగా చాలా కోల్పోతాడని చాణక్య తెలిపారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement