చాణక్యనీతి: ఎటువంటి ఆహారం తినాలి.. ప్రేమ అంటే ఏమిటి.. దానం ఎలా చేయాలి... ఈ కీలక విషయాలు తెలియకపోతే జీవితం వ్యర్థం!

ABN , First Publish Date - 2021-10-12T11:56:44+05:30 IST

ఆచార్య చాణక్య అసాధారణ ప్రతిభతో గొప్పవానిగా పేరుగాంచాడు.

చాణక్యనీతి: ఎటువంటి ఆహారం తినాలి.. ప్రేమ అంటే ఏమిటి.. దానం ఎలా చేయాలి... ఈ కీలక విషయాలు తెలియకపోతే జీవితం వ్యర్థం!

ఆచార్య చాణక్య అసాధారణ ప్రతిభతో గొప్పవానిగా పేరుగాంచాడు. వందల సంవత్సరాలు గడిచిన తరువాత కూడా, అతను ఉత్తమ పండితులలో ఒకరిగా కీర్తి పొందుతున్నారు. రాజకీయాలు, దౌత్యం, సామాజిక శాస్త్రం, ఆర్థికశాస్త్రం సహా అన్ని విషయాలపై ఆచార్య చాణ‌క్య‌కు లోతైన అవగాహన ఉంది. ఏదైనా పరిస్థితిని చూసిన వెంట‌నే చాణ‌క్య‌ దాని పరిణామాలను అంచనా వేసేవారు. ఈ కారణంగానే ఆచార్య చాణక్య త‌న‌ జీవితంలో చేప‌ట్టిన‌ ప్రతీకార్యాన్నీ ప్ర‌ణాళికా బ‌ద్ధంగా చేసి, విజ‌యాన్ని సాధించి, అంద‌రికీ స్ఫూర్తిగా నిలిచారు. ఆచార్య చాణ‌క్య త‌న అపార అనుభ‌వంతో ఒక సాధారణ వ్య‌క్తి కూడా అమోఘ‌మైన విజ‌యాలు సాధించ‌వ‌చ్చ‌ని నిరూపించారు. ఆచార్య తాను గ‌డించిన అనుభవాలన‌న్నింటినీ అమూల్య‌మైన గ్రంథాల రూపంలో మ‌న‌కు అందించారు. వాటిలోనిదే నీతి శాస్త్రం. ఇది ఎంతో ఆద‌ర‌ణ పొందింది. దీనిలో ఆచార్య చాణ‌క్య చెప్పిన నీతి సూత్రాలను అనుస‌రించ‌డం ద్వారా జీవితంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను తొల‌గించుకోవడంతో పాటు విజ‌యం సాధించ‌వ‌చ్చు.  మ‌నిషి తన జీవితంలో ఎంతో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న ఆహారం, దానంతో పాటు ఈ మరో నాలుగు విషయాలపై  స‌రైన అవ‌గాహ‌న క‌లిగివుండాల‌ని చాణక్య నీతి చెబుతోంది. 


ఆహారం: సనాతన ధర్మంలో బ్రాహ్మణుల‌ను ఎంతో గౌర‌వంగా చూసేవారు. అందుకే ఆచార్య చాణక్యుడు నిష్ఠ క‌లిగిన‌ బ్రాహ్మణునికి ఆహారం అందించిన తర్వాత మీకు మిగిలి ఉన్నదే నిజమైన ఆహార‌మ‌ని చెప్పాడు. పూర్వ కాలంలో కొంద‌రు బ్రాహ్మణులు భిక్ష అడగడం ద్వారా తమ కుటుంబాల‌ను పోషించుకునేవారు. ఆ కాలంలో వారు నిరుపేదలు.. అందుకే అప్ప‌టి కాలానికి అది వ‌ర్తించింది. అయితే నేటి ఆధునిక కాలంలో నిరుపేదలకు ఆహారం అందించిన తర్వాత మాత్రమే మీరు భోజ‌నం చేయాలి. అటువంటి ఆహారం కుటుంబానికి శ్రేయస్సును అందిస్తుంది. మనస్సును స్వచ్ఛంగా, సానుకూలంగా మారుస్తుంది. అటువంటివారికి దేవుని దయ కూడా ప్రాప్తిస్తుంద‌ని చాణ‌క్య తెలిపారు.

ప్రేమ: ఆచార్య చాణక్య నీతి ప్రకారం, ప్రేమ అనేది ఇతరుల పట్ల నిస్వార్థంగా ప్రవర్తించే భావన. అయితే అది సంబంధాన్ని బట్టి వ్య‌క్తం చేసే తీరు మారుతుంది. నిజ‌మైన ప్రేమ క‌లిగిన‌పుడు ఎదుటి వ్య‌క్తి నుంచి ఏదో పొందాలనే ఆశ ఉండ‌దు. స్వచ్ఛమైన ప్రేమ అంటే నిస్వార్థమైన‌ది. 


తెలివితేటలు: కొన్ని అమూల్య‌మైన గ్రంథాలు, పురాణాలు చదవడం, వాటిని గుర్తుంచుకోవడం ద్వారా మ‌నిషి త‌న‌ మేధస్సును పెంచుకోవ‌చ్చు. అలాగే ఈ గ్రంథాల‌లోని అమూల్య‌మైన విష‌యాల‌ను గ్ర‌హించిన వ్య‌క్తి  వాటిని తన జీవితంలోకి తీసుకువస్తాడు. ఫ‌లితంగా దుర్మార్గ‌పు పనులకు ఆ వ్య‌క్తి దూరంగా ఉంటాడు. అప్పుడే అత‌ను తెలివితేటలు క‌లిగిన వ్య‌క్తిగా మార‌తాడు. 

దానం: ఆచార్య చాణక్యుడు నిస్వార్థంగా ఇచ్చేదే ఉత్తమ దానమని తెలిపారు. ఒకవేళ ఎవ‌రైనా స‌రే మ‌రొక‌రికి డబ్బు, ఆహారం మొదలైనవాటిని అందరికీ తెలియ‌జేయాల‌నే ఉద్దేశంతో ఇస్తే అది దాతృత్వం కాద‌ని ఆచార్య చాణక్య స్పష్టం చేశారు. అలాగే మ‌న‌సులో కొద్దిపాటి స్వార్థం ఉంచుకొని ఇచ్చినా దాన్ని దాతృత్వం అని ఎలా అంటార‌ని చాణ‌క్య ప్ర‌శ్నిస్తారు. మంచిపేరు ద‌క్కించుకోవాల‌నే ఆశతో అందించే విరాళాలు ఎన్నటికీ విలువైనవి కావ‌ని చాణక్య చెబుతారు. గుప్త దానాలు మాత్ర‌మే ఉత్తమమైనవిగా పరిగణించాల‌ని చాణక్య తెలిపారు.

Updated Date - 2021-10-12T11:56:44+05:30 IST