రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం?

ABN , First Publish Date - 2020-09-19T11:28:13+05:30 IST

రాష్ట్రంలో శని, ఆది వారాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌...

రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం?

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శని, ఆది వారాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం 0.9 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Updated Date - 2020-09-19T11:28:13+05:30 IST