Abn logo
Sep 20 2021 @ 22:53PM

చెంగాళమ్మ ఆలయంలో చండీయాగం

చండీయాగం నిర్వహిస్తున్న అర్చకులు

సూళ్లూరుపేట, సెప్టెంబరు 20 : సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా చండీయాగం నిర్వహించారు. ముందుగా అమ్మణ్ణి ఉత్సవమూర్తిని యాగశాలలో ప్రతిష్ఠించి గోపూజ నిర్వహించారు. అనంతరం చండీయాగం చేశారు. బైరి పార్థసారధిరెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దబ్బల శ్రీమంత్‌రెడ్డి, కళత్తూరు శేఖర్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు గోగుల తిరుపాల్‌ పాల్గొన్నారు.