జడ్జీలపై నిందితుల దాడులా?

ABN , First Publish Date - 2020-10-14T09:03:57+05:30 IST

‘‘దేశం లో చాలామంది నేతలపై కేసులున్నాయి. వారెవరై నా సీఎం జగన్‌ రెడ్డి మాదిరిగా కోర్టులు, న్యాయమూర్తులపై ఎగబడిన ...

జడ్జీలపై నిందితుల దాడులా?

  • కేసులున్న నేతలు దేశంలో ఎందరో
  • వారెవరైనా జగన్‌రెడ్డిలా ఎగబడ్డారా?
  • టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజం
  • వరదల్లో ప్రజలను సర్కారు ఆదుకోవాలి
  • పార్టీ నేతలతో వి.సి. భేటీలో డిమాండ్‌

అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ‘‘దేశం లో చాలామంది నేతలపై కేసులున్నాయి. వారెవరై నా సీఎం జగన్‌ రెడ్డి మాదిరిగా కోర్టులు, న్యాయమూర్తులపై ఎగబడిన సందర్భాన్ని చూశామా?’’ అని మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రశ్నించా రు. కోర్టుల్లో కేసులు ఎదుర్కొంటున్న నిందితులు న్యా యమూర్తులపై దాడిచేస్తూ ఫిర్యాదులు చేయడం, జడ్జిలపై అసభ్యంగా పోస్టులు పెట్టించడం, పెడుతున్న వా రిని ప్రోత్సహించడం అనేవి దేశం ఎన్నడూ చూడని పరిణామాలన్నారు. మంగళవారం రాష్ట్రంవ్యాప్తంగా పార్టీ నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ‘‘మన దేశంలో లాలూప్రసాద్‌ యాదవ్‌, జ యలలిత, మధు కోడా, శిబుసోరెన్‌, ఓం ప్రకాశ్‌ చౌ తాలా వంటి నాయకులు అనేక మంది కేసుల్లో ఇరుక్కొన్నారు. కొందరికి శిక్షలు పడ్డాయి. అయినా వారెవ రూ కోర్టులు, జడ్జిలపై ఈ విధమైన దాడులు చేయలేదు’’ అన్నారు. ప్రతిపక్షాలు, ప్రజలు, మీడియాపై చేసినట్టే రాష్ట్రంలో న్యాయవ్యవస్థపై కూడా దాడి చేస్తున్నారని మండిపడ్డారు.


 ‘‘దేశం మొత్తం మీద నాలుగున్నర వేలమంది ప్రజాప్రతినిధులపై కోర్టులు రోజువారీ వి చారణ చేపట్టాయి. కానీ తన ఒక్కడి కేసులపైనే విచారణ జరుగుతున్నట్లుగా జగన్‌రెడ్డి బెంబేలెత్తుతున్నారు. అందుకే బరి తెగించి న్యాయ వ్యవస్థపై దాడికి దిగుతున్నారు. రాజకీయ నాయకుల కేసులను వేగంగా విచార ణ చేయాలని కోర్టులు ఇప్పుడు కొత్తగా నిర్ణయం తీసుకోలేదు. వారిపై ఏడాది లోపు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు నాలుగేళ్ల కిందట ఆదేశాలిచ్చింది. దా నిని ఇప్పుడు అమలు చేస్తున్నారు. తప్పులు చేయడం, వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా పెద్ద తప్పులకు పా ల్పడటం జగన్‌కి నిత్యకృత్యమైంది. భయపెట్టి, బెదిరించి లోబర్చుకోవడం ద్వారానే ఇన్నాళ్లూ ఆయన రాజకీయం చేస్తున్నారు. దానినే కొనసాగించాలని చూస్తున్నారు. కానీ ఎల్లకాలం అది సాగదు. సా గనికాలం ఇప్పుడు వచ్చిందని ఆయనకు అర్థమైనట్లనిపిస్తోంది. నేరచరిత్ర ఉన్నవాళ్లూ, జైళ్లలో ఉం డి వచ్చిన వాళ్లూ అధికారంలోకి వస్తే వారి ఆలోచనలు, చర్యలు ఎంత నేరపూరితంగా ఉంటాయనేందుకు ఏపీనే పెద్ద ఉదాహరణ’’ అని వ్యాఖ్యానించారు. 



ఒక్కో మంత్రికి ఒక్కో మరక..

రాష్ట్రాన్ని ముంతెత్తుతున్న వరదల్లో బాధితులకు ప్ర భుత్వ సాయం కరువైందని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింద ని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రెండేళ్లుగా వరుస విపత్తు లు వస్తున్నా నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకోలేదు. అటు గిట్టుబాటు ధర లేక ఇటు విపత్తు సాయం లేక రైతులు రెండు విధాలా నష్టపోయారు’’ అని పేర్కొన్నారు. ‘‘వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టడాన్ని రైతాంగం వ్యతిరేకిస్తోంది. వారికి టీడీపీ అండగా నిలుస్తుంది. ఆ చర్యలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలి’’ అని ఆ పార్టీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి పరిరక్షణకు మూడువందల రోజులకుపైగా అవిశ్రాంత పోరాటం చేస్తున్న రైతులు, మహిళలను చంద్రబాబు అభినందించారు. రాష్ట్రంలో వైసీ పీ మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీపడి అవినీతి కుంభకోణాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు విమర్శించా రు. బెంజి మంత్రి, టెండర్ల మంత్రి, మనీ లాండరింగ్‌ మం త్రి, భూకబ్జాల మంత్రి, ఇసుక మాఫియా మంత్రి, లి క్కర్‌ మంత్రులతో మంత్రివర్గం కళకళలాడుతోందని ఎద్దేవా చేశారు. కాగా, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై సీఎం జ గన్‌ చేసిన తప్పుడు ఫిర్యాదులతో, ఆయనపై ఉన్న అవినీ తి కేసులు మరోసారి దేశమంతా చర్చనీయాంశం అ య్యాయని, జగన్‌ సెల్ఫ్‌ గోల్‌ చేసుకొన్నారని విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జగదీశ్‌ వ్యాఖ్యానించా రు.

Updated Date - 2020-10-14T09:03:57+05:30 IST