Abn logo
May 23 2020 @ 20:03PM

దర్శకేంద్రునికి పుట్టినరోజు శుభాకాంక్షలు: చంద్రబాబు

కమర్షియల్ చిత్రాలను మాత్రమే కాకుండా, భక్తిరస ప్రధాన చిత్రాలను కూడా అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. శనివారం (మే 23) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రాఘవేంద్రునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శకేంద్రునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆనంద ఆరోగ్యాలతో నిండునూరేళ్ళూ దర్శకేంద్రుడు వర్ధిల్లాలని ఆయన ఈ సందర్భంగా కోరుకున్నారు. 


‘‘వెండితెరపై తన సృజనాత్మకతతో ఇంద్రజాలాన్ని చేసి ప్రేక్షకులను మైమరపింపచేసిన శతాధిక చిత్రాల దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రేక్షకులకు పదికాలాలు గుర్తుండిపోయే చిత్రాలను అందించిన మీరు, ఆనంద ఆరోగ్యాలతో నిండునూరేళ్ళూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను’’ అని చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


Advertisement
Advertisement
Advertisement