Abn logo
Oct 26 2021 @ 19:39PM

కేసీఆర్ ప్రకటన ఏపీలో పాలనకు అద్దంపడుతోంది: చంద్రబాబు

ఢిల్లీ: ఏపీని డ్రగ్స్‌కు అడ్డాగా మార్చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. జాతీయ స్థాయిలో చైతన్యం కోసమే ఢిల్లీ యాత్ర అని చెప్పారు. రాష్ట్రపతి ముందు నాలుగు ప్రధాన డిమాండ్లు ఉంచామని తెలిపారు. అమ్మ ఒడి వద్దు.. మా బడి ముద్దు అంటూ.. విద్యార్థులు నినాదాలు చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ తాయిలాలు ఇంకెన్నో రోజులు పనిచేయవన్నారు. వాలంటీర్లపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్ ఓటమి ఖాయమన్నారు. తెలంగాణలో వెలుగులు.. ఏపీలో చీకట్లు అంటూ కేసీఆర్ ప్రకటన.. ఏపీలో పాలనకు అద్దం పడుతోందన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption